VIDEO: TS మోడల్ స్కూల్లో ‘స్వచ్ఛభారత్’
NZB: ఆర్మూర్ పట్టణంలోని TS మోడల్ స్కూల్లో ఆదివారం 'స్వచ్ఛభారత్' కార్యక్రమాన్ని నిర్వహించారు. కాలనీవాసులు, విద్యార్థులు స్వచ్ఛందంగా శ్రమదానం చేసినట్లు నిర్వాహకులు సుంకే శ్రీనివాస్ తెలిపారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుందామని పిలుపునిచ్చారు. పరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యత అని అన్నారు.