లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్న బీజేపీ నేతలు

లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్న బీజేపీ నేతలు

కోనసీమ: అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారిని శనివారం బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నల్లా పవన్ కుమార్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, ఆలయంలో నిర్వహించే సుదర్శన హోమంలో పాల్గొన్నారు. పాల్గుణ మాసం లో స్వామిని దర్శించుకోవడం ఆనందంగా ఉందని ఆయన అన్నారు. ఆయన వెంట పలువురు బీజేపీ నేతలు ఉన్నారు.