ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసిన కలెక్టర్

NRPT: రోగులకు వైద్య సేవలు అందించడానికి వైద్య సిబ్బంది ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ మంగళవారం అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి స్కానింగ్ సెంటర్, ఇతర విభాగాలను పరిశీలించారు. సిబ్బంది అందుబాటులో లేకపోవడంపై ఆమె అసహనం వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో ఏవైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని వైద్యులను కోరారు.