VIDEO: నరసింహకొండ వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం

NLR: నెల్లూరు రూరల్ మండలంలోని నరసింహకొండ శ్రీ వేదగిరి లక్ష్మీనరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు మంగళవారం రాత్రి ఘనంగా ప్రారంభమయ్యాయి. వేద పండితుల నడుమ, మంగళ వాయిద్యాలతో ఘనంగా నిర్వహించారు. ప్రత్యేక పుష్ప అలంకరణలో స్వామి అమ్మవార్లు భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ప్రసాదాలను స్వీకరించారు.