పదోన్నతి పొందిన వారికి నియామక పత్రాలు పంపిణీ
ASR: అంగన్వాడీ కేంద్రాల నుండి పిల్లలు, గర్బిణీలు, బాలింతలకు మెరుగైన సేవలు అందేలా చూడాలని ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం సూచించారు. గురువారం మిని అంగన్వాడీల నుండి మెయిన్ అంగన్వాడీ కార్యకర్తలగా పదోన్నతి పొందిన వారికి అరకులోయలో నియామక పత్రాలు అందిస్తూ మాట్లాడారు. అరకు, అనంతగిరి, డుంబ్రిగుడ మండలాల్లో 44 మంది మెయిన్ అంగన్వాడీ కార్యకర్తలగా పదోన్నతి పొందారు.