లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్న పవన్
AP: ఏలూరు జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ద్వారకాతిరుమల మండలంలోని ఐఎస్ జగన్నాథపురంలో లక్ష్మీనరసింహ స్వామిని పవన్ దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి లక్ష్మీనరసింహస్వామికి పట్టు వస్త్రాలు సమర్పించారు.