శాంతిపురంలో ఉపాధి హామీ పనుల పరిశీలన

శాంతిపురంలో ఉపాధి హామీ పనుల పరిశీలన

CTR: శాంతిపురం (M) ఎంకెపురం సమీపంలో జనప చెరువు వద్ద జరుగుతున్న ఉపాధి హామీ పనులను ఎంపీడీవో ప్రేమ్ కుమార్ పరిశీలించారు. పనుల నాణ్యతను ఎంపీడీవో పరిశీలించారు. అయితే గడిచిన మూడు నెలలుగా తమకు ఉపాధి హామీ డబ్బులు రావడం లేదని లబ్ధిదారులు ఎంపీడీవో దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే అధికారులతో మాట్లాడి డబ్బులు పడేలా చర్యలు తీసుకుంటామని ఎంపీడీవో హామీ ఇచ్చారు.