VIDEO: జెండా ఆవిష్కరణ అడ్డుకున్న వైసీపీ నేత

W.G: తణుకు మండలం కొమరవరంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో శుక్రవారం వివాదం రేగింది. సచివాలయం ఆవరణలో జాతీయ జెండా ఆవిష్కరిస్తున్న సమయంలో గ్రామానికి చెందిన వైసీపీ నేత, మాజీ సొసైటీ అధ్యక్షుడు నిమ్మకాయల సురేష్ బాబు పంచాయతీ కార్యదర్శి చిష్టితో పాటు కూటమి నాయకులను అసభ్య పదజాలంతో దూషించి జెండా ఆవిష్కరణ అడ్డుకున్నారు. కార్యదర్శి చిష్టి పోలీసులకు ఫిర్యాదు చేశారు.