నిత్యావసర సరకుల చట్టాన్ని ప్రయోగించిన కేంద్రం

నిత్యావసర సరకుల చట్టాన్ని ప్రయోగించిన కేంద్రం

పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో దేశంలో చమురు, గ్యాస్‌కు తీవ్రంగా కొరత ఏర్పడింది. దీంతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చమురు, సహజవాయువు సరఫరాకు సమస్యలు తలెత్తకుండా నిత్యావసర సరకుల చట్టం 1955ని ప్రయోగించింది. పెట్రోల్, డీజిల్, గ్యాస్‌కు కృత్రిమ కొరత సృష్టించకుండా ఈ నిర్ణయం తీసుకుంది. వంద శాతం గృహ అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.