600 ఎకరాలకు సాగునీరు అందిస్తాం: ఎమ్మెల్యే

600 ఎకరాలకు సాగునీరు అందిస్తాం: ఎమ్మెల్యే

NRML: భైంసా మండలంలోని సిరాల ప్రాజెక్టు ద్వారా ఆయకట్టు కింద ఉన్న 600 ఎకరాలకు సాగునీరు అందించడమే లక్ష్యమని ఎమ్మెల్యే రామారావు పటేల్ తెలిపారు. నేడు ప్రాజెక్టు కాలువ ద్వారా పంటలకు నీటిని ఆయన అధికారికంగా విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, రెండు సంవత్సరాల క్రితం సిరాల ప్రాజెక్టు కట్ట తెగిపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని గుర్తుచేశారు.