ఈ జీతాలతో బతుకు బండి సాగేదెలా?

ఈ జీతాలతో బతుకు బండి సాగేదెలా?

కృష్ణా: మున్సిపల్ ఇంజినీరింగ్, పారిశుద్ధ్య కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని సీఐటీయూ ఇబ్రహీంపట్నం మండల కార్యదర్శి మహేశ్ డిమాండ్ చేశారు. కొండపల్లిలో శనివారం కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. చాలీచాలని జీతాలతో బతుకు బండి ఏలా సాగాలో ప్రభుత్వం ఆలోచించి తక్షణమే జీతాలు పెంచాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో సమ్మె ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.