బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం

బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం

MLG: ఏటూరునాగారం మండలంలోని చిన్నబోయినపల్లి గ్రామానికి చెందిన ఎంపెల్లి సమ్మయ్య మరణంతో ఆయన కుటుంబాన్ని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్ బాబు పరామర్శించారు. దశదిన కర్మలో పాల్గొని కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కర్మకాండల నిర్వహణకు ఆర్థిక సహాయం అందించి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు