ఎస్జిఎఫ్ క్రీడల్లో గార్రెపల్లి విద్యార్థుల ప్రతిభ

PDPL: సుల్తానాబాద్ ప్రభుత్వ హైస్కూల్ మైదానంలో జరిగిన జోనల్ స్థాయి క్రీడల్లో గర్రెపల్లి జడ్పీహెచ్ఎస్ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారు. అండర్-17 వాలీబాల్ బాలికల, బాలుర విభాగాల్లో, అలాగే అండర్-17 బాలికల కబడ్డీ విభాగంలో మొదటి స్థానాలు సాధించారు. జిల్లా స్థాయికి ఎంపికయ్యారు. జిల్లా స్థాయికి ఎంపికైన విద్యార్థులను హెచ్ఎం కవిత అభినందించారు.