పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్

కర్నూలు: జిల్లాలో శనివారం నుంచి 'పల్లెకు పోదాం' కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా ప్రారంభించారు. ఈ కార్యక్రమం జిల్లాలోని 79 గ్రామాల్లో స్పెషల్ ఆఫీసర్ల పర్యవేక్షణలో అమలు కానుంది. పాఠశాలలు, అంగన్వాడీలు, ఆసుపత్రులు, హాస్టళ్లు వంటి ప్రభుత్వ సంస్థలు, మౌలిక సదుపాయాలను జిల్లా యంత్రాంగం తనిఖీ చేసి, సమస్యలను గుర్తించి పరిష్కరించనుంది.