రేపు మారంరెడ్డి పల్లెకు రానున్న కలెక్టర్

రేపు మారంరెడ్డి పల్లెకు రానున్న కలెక్టర్

NLR: సీతారామపురం మండలం మారంరెడ్డి పల్లి పంచాయతీలో కలెక్టర్ హిమాన్షు శుక్లా బుధవారం పర్యటించనున్నారని ఎంపీడీవో శివప్రసాదరావు ఒక ప్రకటనలో తెలిపారు. పల్లె వీక్షణలో భాగంగా గ్రామ సచివాలయాల పనితీరు, అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలు, రైతుసేవా కేంద్రాలు, ఉపాధిహామీ పనులు, గృహనిర్మాణ పథకం, గ్రామాల్లో మౌలిక సదుపాయాలు, తదితరాలను పరిశీలించనున్నట్లు పేర్కొన్నారు.