రూ. 34 లక్షల వ్యయంతో అభివృద్ధి పనులు ప్రారంభం

SKLM: పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తున్నామని, ప్రతీ వార్డులో తాగునీరు, రోడ్లు, మౌళిక సదుపాయాలు కల్పించి పట్టణ రూపురేఖలే మార్చేస్తానని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు. శాంతి నగర్, తాళభద్ర, రాజాం కాలనీ, పెద్ద బ్రాహ్మణ వీధి, నీలాపురం, నర్సిపురం తదితర ప్రాంతాల్లో గురువారం రూ. 34 లక్షల వ్యయంతో అభివృద్ధి పనులు ప్రారంభించారు.