శ్రీశైల క్షేత్రంలో ఎమ్మెల్యే పరిటాల సునీత పూజలు

శ్రీశైల క్షేత్రంలో ఎమ్మెల్యే పరిటాల సునీత పూజలు

ATP: శ్రీశైల క్షేత్రాన్ని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత మంగళవారం ఉదయం దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి వచ్చిన ఆమె మల్లికార్జున స్వామి, భ్రమరాంబిక అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ఆమెకు పూర్ణకుంభంతో స్వాగతం పలికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. లోక కల్యాణం కోసం స్వామివారిని వేడుకున్నట్లు ఆమె తెలిపారు.