మూడు చోట్ల పెసా కమిటీ ఎన్నికలు

మూడు చోట్ల పెసా కమిటీ ఎన్నికలు

ASR: ఈనెల 22 నుంచి 26వ తేదీ వరకు కొయ్యూరు మండలం కినపర్తి, రాజేంద్రపాలెం, రేవళ్లులో పెసా కమిటీ కార్యదర్శి, ఉపాధ్యక్షుల ఎన్నికలు నిర్వహిస్తామని ఎంపీడీవో జీడీవీ ప్రసాదరావు శుక్రవారం తెలిపారు. రాజేంద్రపాలెంకు బాలికల పాఠశాల హెచ్ఎం గోపాలంను ఎన్నికల అధికారిగా, కినపర్తికి ఏఎస్వో చైతన్య, రేవళ్లుకు సీడీపీవో ఎల్.దేవమణిని ఎన్నికల అధికారులుగా నియమించినట్లు తెలిపారు.