సిర్పూర్ విద్యార్థికి తెలంగాణ సాహిత్య అకాడమి అవార్డు
NZB: తెలంగాణ సాహిత్య అకాడమీ గత నెల బాలల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన రాష్ట్రస్థాయి నాటికల రచన పోటీలో మోపాల్ మండలం సిర్పూర్ ఉన్నత పాఠశాల విద్యార్థిని మాధురి ప్రతిభ వెలుగుచూసింది. ఆమె రచించిన ‘పల్లెతనం’ నాటికకు సాహిత్య అకాడమీ బహుమతి లభించినట్లు పాఠశాల ఇన్‌చార్జి ప్రధానోపాధ్యాయురాలు శ్యామల తెలిపారు.