జాతీయ రహదారిపై పోలీసుల స్పెషల్ డ్రైవ్
MNCL: మందమర్రి పోలీస్ స్టేషన్ పరిధిలోని బురదగూడెం, అందుగులపేట జాతీయ రహదారిపై పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాంగ్ రూట్‌లో ప్రయాణిస్తూ.. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన 25 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం సీఐ శశిధర్ రెడ్డి మాట్లాడుతూ.. వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు.