రెండు బైక్స్ ఢీకొని వ్యక్తి మృతి

రెండు బైక్స్ ఢీకొని వ్యక్తి మృతి

GNTR: ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటనపై తాడికొండ పోలీసులు కేసు నమోదు చేశారు. నిడుముక్కల సమీపంలోని పేపర్ మిల్లు వద్ద కుంభ శ్రీనివాసరావు అనే వ్యక్తి ఈ నెల 28న బైక్ కర్లపూడి వస్తుండగా ఎదురుగా వచ్చిన బుల్లెట్ వాహనం బలంగా ఢీకొట్టింది. గాయపడిన శ్రీనివాసరావును గుంటూరు GGHకి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందారు.