రోడ్డు గుంతలు పూడ్చిన BRS నాయకులు

రోడ్డు గుంతలు పూడ్చిన BRS నాయకులు

BHNG: భూదాన్ పోచంపల్లి మండలం భీమనపల్లిలో ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్డు గుంతలమయమై ప్ర‌యాణికులు ప్రమాదాల బారిన పడుతున్నారు. దీంతో BRS గ్రామశాఖ నాయ‌కులు బుధవారం కంకర, సిమెంట్‌తో రోడ్డు గుంతలను పూడ్చివేశారు. ఈ కార్యక్రమంలో BRS జిల్లా నాయకులు కోట మల్లారెడ్డి, శంభారెడ్డి, కలుకూరి పాండు, తదితరులు పాల్గొన్నారు.