మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం.. తక్షిల స్కూల్ విద్యార్థుల ర్యాలీ

మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం.. తక్షిల స్కూల్ విద్యార్థుల ర్యాలీ

JGL: “ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌ తో చేసిన వినాయక విగ్రహాల బదులు మట్టి వినాయకుడిని పూజిద్దాo" అంటూ జగిత్యాల జిల్లా కేంద్రంలోని తక్షిల స్కూల్ విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలు నీటిలో కరగకపోవడం వల్ల పర్యావరణానికి, జలచరాల ప్రాణాలకు హాని కలిగిస్తాయని అందుకే పర్యావరణహితమైన మట్టి వినాయక విగ్రహాలను ఎంచుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.