గర్భిణీ స్త్రీలకు ఉచిత వైద్య పరీక్షలు
KMR: సదాశివనగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గురువారం గర్భిణీ స్త్రీలకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించినట్లు డాక్టర్ అస్మా అఫ్రీన్ అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పలు గ్రామాలకు సంబంధించిన గర్భిణీ స్త్రీలకు అమ్మ ఒడి కార్యక్రమంలో భాగంగా వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి రక్త పరీక్షలు నిర్వహించడం జరిగిందని పేర్కొన్నారు.