ఒరాకిల్ కార్యాలయంపై ఇరాన్ దాడి?
దుబాయ్‌లోని టెక్ సంస్థ ఒరాకిల్ కార్యాలయంపై ఇరాన్ దాడి చేసిందంటూ వస్తున్న వార్తలను UAE ప్రభుత్వం ఖండించింది. ఈ ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని, ఇవి పూర్తిగా నిరాధారమైనవని స్పష్టం చేసింది. దుబాయ్ ఇంటర్నెట్ సిటీలోని ఒరాకిల్ భవనాన్ని ఇరాన్ క్షిపణులతో లక్ష్యంగా చేసుకుందని SMలో కొన్ని పోస్టులు వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో యూఏఈ ప్రభుత్వ 'X' వేదికగా ఓ ప్రకటన విడుదల చేసింది.