'ప్రజా దర్బార్' నిర్వహించిన ఎమ్మెల్యే చినరాజప్ప
KKD: పెద్దాపురంలో TDP రాష్ట్ర కార్యదర్శి సూరిబాబు రాజు అధ్యక్షతన శుక్రవారం 'ప్రజా దర్బార్' నిర్వహించారు. MLA నిమ్మకాయల చినరాజప్ప పాల్గొని, ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఇళ్ల స్థలాలు, రేషన్ కార్డులు, సీఎం రిలీఫ్ ఫండ్ కోరుతూ ప్రజలు దరఖాస్తులు అందించారు. సామాజిక, వ్యక్తిగత సమస్యలపై ఆయాశాఖల అధికారులతో మాట్లాడి చర్యలు చేపడతామన్నారు.