VIDEO: హిందూ శక్తి చాటిన విరాట్ సమ్మేళనం
NZB: భారతీయ ఆత్మ హిందూ ధర్మమని, దేశాన్ని విశ్వగురువుగా నిలబెట్టడమే లక్ష్యమని భీమ్‌గల్ ఉప మండల విరాట్ హిందూ సమ్మేళనంలో వక్తలు అన్నారు. RSS వంద ఏళ్ల ప్రస్థానం సందర్భంగా నిర్వహించిన ఈ భారీ ప్రదర్శనకు మహిళలు, పురుషులు, చిన్నారులు వేలాదిగా తరలివచ్చారు. హిందూ సమాజ ఐక్యతను చాటుతూ సభ ప్రాంగణం జనసంద్రమైంది. ధర్మ రక్షణకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని పిలుపునిచ్చారు.