'బ్యాంకు సేవలపై అవగాహన కలిగి ఉండాలి'
MNCL: బ్యాంకు సేవలపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని దండేపల్లి అక్షరాస్యత కేంద్రం కౌన్సిలర్ వేల్పుల రవీందర్ అన్నారు. మంగళవారం జన్నారం మండలంలోని తిమ్మాపూర్ గ్రామంలో వివో లీడర్లకు, మహిళలకు బ్యాంకు లావాదేవీలపై అవగాహన కల్పించారు. బ్యాంకుల ద్వారా ప్రజలకు పొదుపు, ఇన్సూరెన్స్, వాహనం, వ్యవసాయ రుణాలు అందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మహిళలు పాల్గొన్నారు.