ప్రజావాణిలో 253 దరఖాస్తులు
SRCL: జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించి, ప్రజల నుంచి అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ అర్జీలు స్వీకరించారు. అర్జీలు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. మొత్తం 253 దరఖాస్తులు వచ్చాయన్నారు. రెవెన్యూ శాఖకు 67, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి 64, హౌసింగ్ శాఖకు 46, జిల్లా పంచాయతీ అధికారికి 13 దరఖాస్తులు వచ్చినట్లు వెల్లడించారు.