అక్రమంగా విక్రయిస్తున్న మద్యం స్వాదీనం: SI

అక్రమంగా విక్రయిస్తున్న మద్యం స్వాదీనం: SI

MNCL: అక్రమంగా విక్రయిస్తున్న మధ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు SI శ్వేత ఒక ప్రకటనలో తెలిపారు. భీమారం మండలం బూరుగుపల్లి గ్రామానికి చెందిన శంకర్ తన కిరాణా షాపులో మద్యం విక్రయిస్తున్నాడనే సమాచారం మేరకు సిబ్బందితో కలిసి దాడులు చేశామన్నారు. కిరాణా షాపులో లభించిన 6.900 లీటర్ల మద్యాన్ని సీజ్ చేశామని ఎస్సై వివరించారు.