CM చంద్రబాబు రేపటి జిల్లా పర్యటన వివరాలు
KDP: కమలాపురం నియోజకవర్గంలోని పెండ్లిమర్రికి రేపు CM చంద్రబాబు రానున్నట్లు అధికారులు తెలిపారు. 'అన్నదాత సుఖీభవ - PM కిసాన్' కార్యక్రమంలో పాల్గొంటారన్నారు. మ. 1 గం. వెల్లటూరులోని మన గ్రోమోర్ ఎరువుల సెంటర్‌ను పరిశీలించి, మ. 1.40కు పెండ్లిమర్రిలో ప్రజావేదిక కార్యక్రమంలో మాట్లాడానున్నారు. సా. 4.20 గం. చిన్నదొరసారిపల్లెలో రైతులతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహిస్తారన్నారు.