గాయపడ్డ జర్నలిస్టును పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
MHBD: కురవి మండలం తట్టుపల్లి గ్రామానికి చెందిన సీనియర్ పాత్రికేయుల బేతమల్ల సహదేవ్ ఇటీవల ద్విచక్రవాహన ప్రమాదంలో గాయపడి ప్రస్తుతం ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్నాడు. విషయం తెలుసుకున్న డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే డిఎస్ రెడ్యానాయక్ శుక్రవారం వారి నివాసానికి వెళ్లి ఆయనను పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకుని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.