రావిమతంలో లక్ష్మీ గణపతి హోమం
AKP: రావిమతం మండలం టి.అర్జాపురం బాల వరసిద్ధి వినాయక ఆలయంలో లక్ష్మీ గణపతి హోమాన్ని భక్తిశ్రద్ధలతో ఆదివారం నిర్వహించారు. ప్రాంతం సస్యశ్యామలంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ఈ హోమాన్ని నిరంతరం చేస్తున్నారు. ఇప్పటివరకు 58 సార్లు నిర్వహించినట్లు అర్చకులు తెలిపారు. హోమంతో పాటు సహస్ర దూర్వాయుగ్మ పూజలను కూడా నిర్వహించారు.