ఆటో టైర్ కింద పడి చిన్నారి దుర్మరణం

ఆటో టైర్ కింద పడి చిన్నారి దుర్మరణం

KMR: జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. సాలూర మండలం సాలంపాడ్ గ్రామానికి చెందిన అయేషా బేగం ఇంటి ముందుకు వచ్చిన ఉల్లిగడ్డల ఆటో వద్దకు ఆమె 18 నెలల చిన్నారి పాకుతూ వెళ్లింది. బేరం కుదరక అయేషా ఇంటిలోకి వెళ్లగా, పాప ఆటో ముందున్న విషయం గమనించకుండా డ్రైవర్ ఆటో ముందుకు వెళ్లాడు. చక్రాలు చిన్నారిపై నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.