పాఠశాలలో విష జ్వరాలు.. మంత్రి ఆనం సమీక్ష

AP: నెల్లూరు జిల్లా ఆత్మకూరు బాలికల గురుకుల పాఠశాలలో విషజ్వరాలు కలకలం రేపాయి. దీనిపై మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్‌తోపాటు అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. పాఠశాల వద్దకు వెళ్లి తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. జ్వరాల బారిన పడిన విద్యార్థినులను జిల్లా వైద్యశాలకు తరలించి తక్షణ వైద్యం అందించాలని సూచించారు.