VIDEO: గ్యాస్ ఆఫీస్ ముందు డప్పులతో నిరసన
AKP: నర్సీపట్నం గ్యాస్ వినియోగదారుల ఆందోళన రోజు రోజుకి ఎక్కువవుతోంది. బుధవారం హిందుస్థాన్ పెట్రోలియం గ్యాస్ ఆఫీస్ ముందు ప్రజలు డప్పులతో నిరసన వ్యక్తం చేశారు. గ్యాస్ బుక్ చేసుకున్నప్పటికీ తమకు సప్లై చేయట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి రోజు ఇదే పరిస్థితి కొనసాగుతుందని పేర్కొన్నారు. స్పందించాల్సిన గ్యాస్ కార్యాలయం సిబ్బంది పట్టించుకోవడంలేదని వాపోయారు.