VIDEO: 'ముస్లింలకు అండగా ఉంటా'
GNTR: కష్టకాలంలో అండగా ఉన్న ముస్లింలకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ అన్నారు. పొన్నూరులోని 4వ వార్డు డా.APJ అబ్దుల్ కలాం షాదీఖానా వద్ద అంజుమన్ కమిటీ ఆధ్వర్యంలో నిర్మించిన అంజుమన్ షాపింగ్ కాంప్లెక్స్ నూతన భవనాన్ని గురువారం ఆయన ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్యక్రమంలో అంజుమన్ అధ్యక్షుడు మగ్బుల్ బేగ్ తదితరులు పాల్గొన్నారు.