'వందేళ్ల ఉత్సవాలను విజయవంతం చేయాలి'
PDPL: జనవరి 18న ఖమ్మంలో జరిగే CPI వందేళ్ల ఉత్సవాలను విజయవంతం చేయాలని జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం పిలుపునిచ్చారు. గోదావరిఖని భాస్కరరావు భవన్‌లో జరిగిన CPI నగర సమితి సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో అన్ని డివిజన్లలో CPI పోటీ చేస్తుందన్నారు. అన్ని డివిజన్లలో ప్రజలను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.