మంత్రి జూపల్లిని కలిసిన నూతన మంత్రి

నారాయణపేట: కొత్తగా రాష్ట్ర మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి సోమవారం పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావును హైద్రాబాద్ లోని డా. బీఆర్ అంబేడ్కర్ సచివాయంలో మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా పుష్పగుచ్చాన్ని అందించారు. వాకిటి శ్రీహరికి మంత్రి జూపల్లి శుభాకాంక్షలు, అభినందనలు తెలిపారు.