జేఎన్టీయూ విద్యార్థులపై కక్ష సాధింపు చర్యలు మానుకోవాలి

HYD: జేఎన్టీయూ విద్యార్థులపై కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని కోరుతూ ఉన్నత విద్యామండలి చైర్మన్ డా. లింబాద్రికి వినతిపత్రం సమర్పించినట్లు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి జాజుల లింగంగౌడ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా లింగంగౌడ్ మాట్లాడుతూ.. సమస్యలు పరిష్కరించాలని నిరసనలు చేపడితే నోటీసులు జారీ చేయడం చాలా దుర్మార్గమైన చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు.