చిన్నమండెంలో రోడ్డు భద్రతపై కలెక్టర్ ఫోకస్

చిన్నమండెంలో రోడ్డు భద్రతపై కలెక్టర్ ఫోకస్

అన్నమయ్య: చిన్నమండెంలో రోడ్డు భద్రతను మెరుగుపరచేందుకు కలెక్టర్ నిశాంత్ కీలక ఆదేశాలు జారీ చేశారు. బుధవారం ఆకస్మిక పర్యటనలో భాగంగా స్పీడ్ బ్రేకర్లు, సూచిక బోర్డులు, కూడళ్లలో లైటింగ్, మలుపుల వద్ద భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. ముఖ్య కూడళ్లలో తప్పనిసరిగా లైటింగ్ ఏర్పాటు చేయాలని, హైవే కనెక్టివిటీ రోడ్ల కిరువైపులా పెరిగిన చెట్లపొదలను తొలగించాలని సూచించారు.