నకిలీ విలేకరులపై చర్యలు తీసుకోవాలని డీసీపీకి వినతి

మంచిర్యాల: నకిలీ విలేకరులపై చర్యలు తీసుకోవాలని డీసీపీకి వినతి విలేకరుల పేరుతో అక్రమాలకు పాల్పడుతున్న వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని సోమవారం మంచిర్యాల డీసీపీ భాస్కర్‌కు టీయూడబ్ల్యూజే (ఐజేయూ) జిల్లా నాయకులు వినతిపత్రం అందజేశారు. ఎలాంటి గుర్తింపు లేకుండా కొందరు విలేకరులమని పలువురిని బెదిరిస్తున్నట్లు డీసీపీకి వివరించారు.