తుఫాన్ బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే
E.G: తాళ్లపూడి మండలం అన్నదేవరపేట, గజ్జరం గ్రామాల్లో 'మొంథా' తుఫాన్ కారణంగా పాక్షికంగా దెబ్బతిన్న ప్రదేశాలను కొవ్వూరు నియోజకవర్గ MLA ముప్పిడి వెంకటేశ్వరరావు బుధవారం సందర్శించారు. బ్రిడ్జి, నేలకూలిన ఇళ్లు, ప్రజల కోసం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని ఆయన పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, ప్రభుత్వాధికారులు, కార్యకర్తలు పాల్గొన్నారు.