ఈనెల 17న పెన్షనర్లకు సన్మానం
VZM: అఖిల భారత పెన్షనర్ల దినోత్సవం సందర్భంగా ఈనెల 17న బొబ్బిలి శ్రీకళా భారతి ఆడిటోరియంలో 75ఏళ్లు నిండిన పెన్షనర్లను సన్మానించనున్నట్లు పెన్షనర్ల అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రౌతు రామమూర్తి తెలిపారు. పెన్షనర్ల దినోత్సవం ప్రచార పత్రాలను సోమవారం విడుదల చేశారు. సమావేశానికి పెన్షనర్లు హాజరు కావాలని కోరారు.