నీరు విడుదలతో నీట మునిగిన పంటలు

PDPL: భారీ వర్షాలతో ఎల్లంపల్లి గేట్లు ఎత్తివేయడంతో భారీగా వరద నీరు దిగువ ప్రాంతమైన మంథని మండలంలోని సుంద్దిళ్ళ బ్యారేజ్‌లోకి వస్తుంది. బ్యారేజ్ నుంచి 5 లక్షల క్యూసెక్కుల నీరు విడుదలతో గోదావరి పరివాహక ప్రాంతాలలోని పోతారం, విలోచవరంలో పత్తి, వరి పంటలు నీట మునిగాయి. పంట నీట మునగడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం తమని ఆదుకోవాలని కోరుతున్నారు.