నలుగురు బాలికలు మిస్సింగ్.. ఛేదించిన పోలీసులు

నలుగురు బాలికలు మిస్సింగ్.. ఛేదించిన పోలీసులు

కృష్ణా: గన్నవరం(M) ముస్తాబాద్‌లో నలుగురు బాలికలు అదృశ్యం అయ్యారు. విజయవాడలోని ఓ కాలేజీలో ఇంటర్ చదువుతున్న బాలికలు కాలేజీకి వెళ్లకుండా షాపింగ్ మాల్‌కి వెళ్లారు. తల్లిదండ్రులు మందలించడంతో రాత్రి ఇంటి నుంచి వెళ్లిపోయారు. దీంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లు సీఐ శివప్రసాద్ తెలిపారు.