విద్యార్థులు దేశ రాజ్యాంగంను అర్థం చేసుకోవాలి: గిరిజమ్మ
SS: పెనుకొండ మండలం వెంకటరెడ్డిపల్లి ప్రాథమిక ఉన్నత పాఠశాలలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలను ప్రధానోపాధ్యాయులు నారాయణ స్వామి ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించారు. ఉపాధ్యాయురాలు గిరిజమ్మ మాట్లాడుతూ.. ప్రతి విద్యార్థి దేశ రాజ్యాంగంను అర్థం చేసుకొని రాజ్యాంగ విలువలు కాపాడుకోవాలని తెలిపారు. దేశ సమైక్యతకు కృషి చేసే విధంగా విద్యార్థులు ఎదగాలని ఉపాధ్యాయులు కోరారు.