'మీ ఆయుధాలు నా ముందు పనిచేయవు'.. మోదీ ఫైర్

'మీ ఆయుధాలు నా ముందు పనిచేయవు'.. మోదీ ఫైర్

కోల్‌కతాలో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం మమతా బెనర్జీ ప్రభుత్వంపై ప్రధాని మోదీ విరుచుకుపడ్డారు. తనఈ సభను అడ్డుకునేందుకు వంతెనలు మూసివేసి, వాహనాలను నిలిపివేసి ట్రాఫిక్ జామ్ చేశారని ఆరోపించారు. బీజేపీ జెండాలు, పోస్టర్లను తొలగించినా.. ప్రజల ఉత్సాహాన్ని ఆపలేకపోయారని ఎద్దేవా చేశారు. టీఎంసీ ఎన్ని అడ్డంకులు సృష్టించినా బెంగాల్‌లో మార్పును ఎవరూ ఆపలేరని స్పష్టం చేశారు.