గద్వాలలో బంగారు వ్యాపారి ఇంట్లో చోరీ

GDWL: జిల్లా కేంద్రంలోని రాజా వీధిలో బంగారు వ్యాపారి సంజీవ్ ఇంట్లో దొంగతనం జరిగింది. బాధితుడు సంజీవ్ కథనం ప్రకారం వివరాలు.. గురువారం తమ ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి 7 తులాల బంగారము 5.1/4 కేజీల వెండి, రూ.1 లక్ష 30 వేల నగదు అపహరించారని తెలిపారు. ఘటనా స్థలానికి పట్టణ ఎస్ఐ కళ్యాణ్ చేరుకొని వేలు ముద్ర ఆధారాలు స్వీకరించారు. కేసు నమోదు చేశారు.