జిల్లా వ్యాప్తంగా 262.2 మి.మీ వర్షపాతం నమోదు

జిల్లా వ్యాప్తంగా 262.2 మి.మీ వర్షపాతం నమోదు

ELR: జిల్లాలో గడిచిన 24 గంటల్లో నమోదైన వర్షపాత వివరాలను వాతావరణ శాఖ అధికారులు సోమవారం వెల్లడించారు. జిల్లాలో అత్యధికంగా వేలేరుపాడులో 19.4 మిల్లీమీటర్లు, అత్యల్పంగా కైకలూరు మండలంలో 3.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు  తెలిపారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 262.2 మి.మీ వర్షపాతం నమోదు కాగా, సరాసరిన 9.4 మిల్లీమీటర్లు వర్షం కురిసిందన్నారు.